కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వాల్సిందే: టి యు డబ్ల్యూ జే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్.

తేది:08-02-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్ : కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు వచ్చేవరకు ఈ ప్రభుత్వంపై పోరాటం చేసి సాధించేందుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అండగా ఉంటుందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ స్పష్టం చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫిరెన్స్ లో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ ల సంఖ్యను భారీగా తగ్గించడానికి 252 జీవోను ఈ ప్రభుత్వం తీసుకువచ్చి తీరని అన్యాయం చేసిందని, గతంలో 239 జీవో ద్వారా 23 వేల అక్రిడిటేషన్లు అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఇస్తే ఆ సంఖ్యను పదివేల దాకా తగ్గించే దిశగా ఈ నూతన జీఓ వచ్చిందని ఆరోపించారు. అనేక పోరాటాలు చేసిన అనంతరం సవరణ జీవో 103 తీసుకువచ్చినప్పటికీ జర్నలిస్టులందరికీ న్యాయం జరగలేదని, కేవలం విభజించి పాలించాలన్న డెస్క్, బ్యూరో జర్నలిస్టులకు ఒకే రకమైన కార్డు మాత్రం ఇస్తామని ప్రకటించినప్పటికీ కేబుల్ జర్నలిస్టులకు సవరణ జీవోలో కూడా ఏమాత్రం న్యాయం జరగకపోవడం అన్యాయం అన్నారు. గతంలో ఐ అండ్ పి ఆర్ ద్వారా దాదాపు 44 కేబుల్ చానల్స్ కు రాష్ట్ర స్టయిల్ 12 కార్డులు చొప్పున జారీ చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆ సంఖ్యను సున్నాకు పరిమితం చేయడం ఏం న్యాయమని ప్రశ్నించారు. కేబుల్ రిపోర్టర్లకు న్యాయం జరిగే విషయంలో అవసరమైతే కోర్టుమెట్లు ఎక్కుతామని ప్రకటించారు. కేబుల్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సంఘీభావంగా మల్టీ సిగ్నల్ ఆపరేటర్లు ఒకరోజు కేబుల్ ప్రసారాలను కొన్ని గంటలపాటు నిలుపుదల చేసి తమ నిరసన తెలపాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం నిరంకుశ ధోరణితో ముందుకు సాగుతోందని జర్నలిస్టులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి వచ్చిన సందర్భం లేదని చెప్పారు. కేబుల్ చానల్స్ ను, శాటిలైట్ ఛానల్స్ ను వేరుగా చూడరాదని, అన్ని చానల్స్ లో పనిచేసేది జర్నలిస్టులే అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తు ఎరగాలన్నారు. ఎం ఎస్ ఓ ల సంఘం నాయకులు కొల్ల కిషోర్ మాట్లాడుతూ మల్టీ సిగ్నల్ ఆపరేటర్ల దృష్టిలో శాటిలైట్ ఛానల్ అయినా కేబుల్ ఛానల్ అయిన ఒకటే అని, అన్ని చానళ్లు కూడా వార్త ప్రసాదాలు అందిస్తాయన్నారు. కేబుల్ చానల్స్ రిపోర్టర్స్ కు అన్యాయం జరిగితే ఒకరోజు కేబుల్ ప్రసారాలను నిలుపుదల చేసి తమ సత్తా ఏంటో చాటుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కేబుల్ చానల్స్ నిర్వాహకులు,నాయకులు కడకంచి వెంకట్ ,చారి, శివ, భరత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *