తేది:8-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో నిబంధనలకు అతిక్రమంగా నిర్మించిన గోడలను శనివారం పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో పాలకవర్గం తొలగించారు. పుప్పాల గంగారం అనే వ్యక్తి గోనే శంకర్ ఇంటి ఎదురుగా, గ్రామపంచాయతీ మురికి కాలువపై గోడ నిర్మించారు. గోనె శంకర్ ఫిర్యాదు మేరకు అనుమతి లేదని కట్టడం అని భావించి. వాటిని తొలగించాలని వారికి మూడుసార్లు నోటీసులు సమయపాళంగా జారీ చేసి, వారు తొలగించకపోవడంతో గ్రామపంచాయతీ తీర్మానం మేరకు వారికి ముందస్తు సమాచారం ఇచ్చి గ్రామపంచాయతీ సిబ్బందితో తొలగించడం జరిగిందని పంచాయతీ పాలకవర్గం తెలిపింది. ఈ విషయంలో రక్షణ కల్పించమని స్థానిక పోలీసులకు సమాచారం అందజేయడం జరిగిందని పాలకవర్గం వివరించారు.