ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో పోలింగ్ సామగ్రిని తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజ గౌడ్.

తేది:08-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఈనెల 11న జరిగే ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేయా లని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజ గౌడ్ అధి కారులను ఆదేశించారు.
ఆదివారం ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో పోలింగ్ సామగ్రిని తనిఖీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ మాట్లాడుతూ:
పోలింగ్ కేంద్రాలతోపాటు రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ లలో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈనెల 9 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎన్నికల అధికారులు మరియు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *