వరంగల్ జిల్లా జ్యోతిబా ఫూలే విగ్రహ ప్రతిష్ఠకు పిలుపు.తెలంగాణ జంక్షన్ చింతల్ బ్రిడ్జి నర్సంపేట్ రోడ్‌ ఈరోజు ప్రతిష్ఠాపన – కమిటీ కరపత్రాలు విడుదల.

తేది:07-02-2026 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

వరంగల్ జిల్లా: తెలంగాణ జంక్షన్ చింతల్ బ్రిడ్జి నర్సంపేట రోడ్ వరంగల్ కూడలిలో మహాత్మా జ్యోతి భా ఫూలే విగ్రహ ప్రతిష్టాపన కై మనమందరం చేయి చేయి కలుపుదాం విగ్రహ నిర్మాణంలో భాగస్వామ్యం అవుదాం. పై విషయానికి సంబంధించిన కరపత్రాలను ఫూలే విగ్రహ కమిటీ ఉపాధ్యక్షులు పోగుల కన్నయ్య ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫూలే విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు గడ్డం శరత్ మాట్లాడుతూ,మొట్ట మొదటగా తెలంగాణా జంక్షన్ లో మహాత్మా జ్యోతిభా ఫూలే విగ్రహాన్ని ప్రతిష్టించుటకు ప్రత్తిపాదించి విగ్రహాన్ని అందించిన prof. చింతం ప్రవీణ్ కుమార్ గారికి,ప్రజాప్రతినిధులకు, పెద్దలకు , విద్యావంతులు, సామాజిక కార్యకర్తలకు , అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యేక ఉద్యమభి వందనాలు తెలియజేస్తూ,మన దేశంలో అస్పృశ్యతను కుల అణిచివేతలను కుల పీడనలను తీవ్రంగా వ్యతిరేకించి సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని మొదటగా ప్రతిపాదించిన మహనీయుడు జ్యోతిభా ఫూలే! పురాణాలలోని నాయకులలో త్యాగశీలి బలి చక్రవర్తిని తన ఆదర్శమూర్తిగా భావించినవాడు. పురాణాల్లో .తన భార్యకు చదువు నేర్పించి ఆమె చేత బాలిక పాఠశాలలను పెట్టించిన వాడు ఆమెకు అండగా ఉండి ప్రోత్సాహపరిచినవాడు. మోసగించ బడిన ఒక బ్రాహ్మణ స్త్రీకి తమ ఇంట్లో రక్షణ ఇచ్చి పురుడు పోయించి ఆ బిడ్డను తమ కొడుకుగా యశ్వంత్ అని పేరు పెట్టి పెంచి పెద్ద చేసిన వారు. తనను చంపటానికి వచ్చిన అగ్రవర్ణాలు పంపిన బడుగు వర్గాల నిరుపేద గుండాలకు ఆకలి తీర్చి, తన బోధనలతో అంగుళీ మాలుడిని బుద్ధుడు సన్మార్గుడిగా మార్చినట్లు మార్చి తన అనుచరులుగా చేసుకున్న మహనీయుడు. అంబేద్కర్ తన ప్రాణ సమాన ముగ్గురు గురువులలో ఒకడిగా ప్రకటించిన వాడు. వేలాది ప్రజల మధ్య బొంబాయి మహా నగరములో ప్రజల చెత “మహాత్మ” అని బిరుదు పొందిన భారత దేశ మొదటి మహాత్ముడు.మహనీయుడు గౌతమ బుద్ధుని తర్వాత ఆధునిక గౌతమ బుద్ధుడు అనదగిన వ్యక్తి. మహాత్మ జ్యోతిబాపూలే!
అందుకని ఆ మహనీయుని విగ్రహ ఏర్పాటుకు సమస్త ప్రజలు చేయూతనందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో పూలె విగ్రహ ప్రతిష్టాపన కమిటీ గౌరవ అధ్యక్షులు సోమా రామూర్తి,ప్రధాన కార్యదర్శి ల్యాదల్ల భారత్,ధర్మపురి రామారావు,కంజర్ల జాకబ్ ,ఈసంపెల్లి ప్రభాకర్, యాదగిరి ప్రసాద్,రౌతు శ్రీనివాస్, కేడెల ప్రసాద్,బందెల సదన్న, గురుమిళ్ల రాజు,తెలంగాణ కొమురన్న,మిట్టపెల్లి శంకర్అన్న, మోహన్ అన్న, పోతరాజు ఆనంద్, తగరపు వేణు,ఆకేనపెల్లి కృష్ణ, పోలేపాక భాస్కర్, గడ్డం సరిత, సింగారపు పప్పి, ఐత సురేష్, s. లాజర్, పసుల శ్రీనివాస్, అప్పని వెంకన్న, పాకాలపాటి జోసెఫ్, కొల్లూరి లేమిల్, పోగుల అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *