తేది:07-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మెట్ పెల్లి మున్సిపల్ పరిధిలో బ్యాలెట్ పేపర్ వెరిఫికేషన్ ను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజ గౌడ్ పర్యవేక్షించారు.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సాగాలని సూచించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సంఖ్య, నాణ్యతను జాగ్రత్తగా పరిశీలించారు. ఎటువంటి లోపాలు లేకుండా ముందస్తు తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి దశలో ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మోహన్, సంబంధిత అధికారులు, ఎన్నికల సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.