తేది:7-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా : తూప్రాన్ మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్‌ల భద్రపరిచే విధానం, పంపిణీ ప్రక్రియ, అలాగే ఎన్నికల నిబంధనల ప్రకారం పారదర్శకత, భద్రత పాటిస్తున్నారా అనే అంశాలపై అధికారులతో చర్చించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, లోపాలు లేకుండా నిర్వహించాలన్న లక్ష్యంతో ప్రతి దశను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
పోస్టల్ బ్యాలెట్ హక్కు కలిగిన ఉద్యోగులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకాలంలో బ్యాలెట్‌లు అందేలా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల నిర్వహణలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ గారు సూచించారు. మొత్తం మీద, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఈ తనిఖీ సందర్భంగా పిలుపునిచ్చారు.