మెదక్ మున్సిపాలిటీ పరిధిలో భారీ ఫ్లాగ్ మార్చ్ ఎన్నికల నేపథ్యంలో అదనపు ఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు భరోసా.

తేది:6-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా మెదక్ మున్సిపాలిటీ పరిధిలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ ఫ్లాగ్ మార్చ్‌కు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ మహేందర్ గారు హాజరై, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల గుండా పోలీసులు కవాతు నిర్వహించి, శాంతిభద్రతల పరిరక్షణకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఉందని ప్రజలకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ,
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన నిఘా, నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే, ప్రజలు ఎలాంటి భయాందోళనకు లోనుకాకుండా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ ఫ్లాగ్ మార్చ్‌తో పట్టణంలో భద్రతా వాతావరణం మరింత బలపడిందని, ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టమైన సందేశం వెళ్లింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *