తేది:6-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా:ఇబ్రహీంపట్నం మండలం కోమటి కొండాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ కొప్పేల పద్మజ వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు అన్నప్రాసన చేయించారు. అనంతరం మాట్లాడుతూ, చిన్న పిల్లల శారీరక-మానసిక ఎదుగుదలలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో యూపీఎస్ ప్రధాన ఉపాధ్యాయురాలు సుధారాణి, ఉపాధ్యాయులు అల్లకట్టు సత్యనారాయణ, వేణుగోపాల్, నర్మద, జ్యోత్స్న, అంగన్వాడీ టీచర్లు స్వరూప రాణి, సుమలత, ఆశా వర్కర్లు పద్మ, వసంతతో పాటు పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.