తేది:06-02-2026 హన్మకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.
వరంగల్ జిల్లా: ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు బిర్రు నర్ససమ్మ ,ఉపలయ్య కు ఇల్లు కట్టుకునే స్థితిలో లేకపోవడంతో, ప్రజాసేవలో నిజమైన నాయకత్వం చూపిస్తూ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు ముందుగా మాట్లాడి, ‘ఆస్టోరినిక్’ సంస్థతో రూ.5 లక్షల మేర ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించేలా చర్యలు చేపట్టారు. ఇది కేవలం ఓ ప్రాజెక్ట్ కాదు నాయకత్వం, బాధ్యత, ప్రజాప్రయోజనం అన్నమాటకు చారిత్రాత్మక ఉదాహరణ. ఈ క్రమంలో నేడు ప్రథమ ఇల్లు నిర్మాణం ప్రారంభమైంది. వర్ధన్నపేట టౌన్లో తొలి ఇల్లు పనులను ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు స్వయంగా పరిశీలించి, నిర్మాణం నాణ్యతపై సకాలంలో దృష్టి సారించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సంక్షోభాలను తెలుసుకుని, వాటికి తక్షణమే పరిష్కారం చూపించగల నాయకత్వం అన్నదే స్పష్టం అయింది.ప్రజా ఆశలు, మాటలు కాదు మాటతోనే కాదు, పనితోనే నిరూపిస్తున్న నాయకత్వం ఇది. ఇలాంటి సానుకూల చర్యలు వర్ధన్నపేటలోనే కాకుండా నియోజకవర్గ స్థాయిలో కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని స్థానికులు అభినందిస్తున్నారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో 10వ వార్డు అభ్యర్థి కొండేటి రజిత – సాంబయ్య, తో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.