తేది:06-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS ఇశ్రతాబాద్ గ్రామ రిపోర్టర్ మర్పల్లి రాజ్ కుమార్.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 14 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా నియమించిన ఇష్రతాబాదు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాయిపాడు స్వరూప రమేష్ మరియు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. వార్డు కౌన్సిలర్ గా రాయిపాడు స్వరూప రమేష్ గారిని గెలిపిస్తే వార్డు లో ఏ సమస్యలు లేకుండా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంటి స్థలం లేని పేదవారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయించి,తాగునీటి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇష్రతాబాదు ఉప సర్పంచ్ శ్రీనివాస్, గ్రామ వార్డు మెంబెర్స్ రషీద్,ఇర్ఫాన్,రమేష్ మరియు ఇష్రతాబాద్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.