తేది:05- 02- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: బార్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు జగిత్యాల జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను కలిసి,కోర్టు ను సందర్శించి బార్ అసోసియేషన్ వారి వినతి మేరకు కోర్టు కు మరియు బార్ అసోసియేషన్ వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు నిధులు మంజూరు చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాచకొండ శ్రీరాములు ప్రధాన కార్యదర్శి అందే మారుతి సీనియర్ న్యాయవాది జనార్దన్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ కొలుగురి దామోదర్ రావు న్యాయవాదులు బండ భాస్కర్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, మహేందర్, సురేందర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.