జగిత్యాల ఈవీఎం గోదాము తనిఖీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బిఎస్ లత.

తేది:05-02-2026 TSLAWNEWS జగిత్యాలజిల్లా ఇంచార్జి
ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు గురువారం రోజున జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ దరూర్ క్యాంప్ లో గల ఈవీఎం లను భద్రపరిచిన గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ:
ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల భద్రత, సిసి కెమెరాల పనితీరు, సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించడం జరిగిందని తెలిపారు.
గోదాము వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తతతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు.
ఈ పర్యవేక్షణలో అదనపు కలెక్టర్ బిఎస్ లత ,జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు మరియు కలెక్టరేట్ ఏవో హకీమ్, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ మరియ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *