గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తాపడి పారిశుధ్య కార్మికుడికి తీవ్ర గాయాలు.

తేది:04-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా సారంగాపూర్ క్రైమ్ రిపోర్టర్ ఆర్ రాజేందర్.

జగిత్యాల జిల్లా : సారంగాపూర్ బట్టపల్లి గ్రామం బుధవారం రోజు సాయంత్రం గ్రామపంచాయతీ చెత్త ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి పారిశుధ్య కార్మికుడు తిరుపెల్లి నర్సయ్య కు తీవ్ర గాయాలతో బయట పడ్డాడు ట్రాక్టర్ బోల్తాపడిన విషయం గ్రామస్థులకు తెలిసిన వెంటనే హుటాహుటిన ప్రమాద స్థలం చేరుకొని ట్రాక్టర్ కింద పడ్డ కార్మికుడు నర్సయ్య ను బయటకు తీసి 108 అంబులెన్స్ లో సివిల్ ఆస్పిటల్ కు పంపారు సివిల్ ఆస్పిటల్ డాక్టర్ ప్రాణాపాయం లేదని చెప్పారు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని సర్పంచ్. అశ్విని చెప్పారు ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్థులు వెంటనే పంచాయతీ కార్మికున్ని వెలికి తీసి నందుకు గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *