
తేది:04-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి, ఎనిమిదో వార్డును సుందర వందరంగా తీర్చిదిద్దుకోండి- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో 8వ వార్డులో ఎక్కడ చూసినా ప్రజల్లో కన్నీరు, వాళ్ల బాధక సాధకులను చూసి ఎనిమిదవ వార్డు ప్రజల కష్టాలను తీర్చడానికి, సమస్యలను పరిష్కరించడానికి, ఎనిమిదవ వార్డును అభివృద్ధి చేయడానికి కీర్తిశేషులు మాజీ చైర్మన్ సిహెచ్ నరసింహ గౌడ్ కుమారుడిగా 8వ వార్డు అభివృద్ధికి సంపూర్ణంగా కృషి చేస్తానని కీర్తిశేషులు మాజీ చైర్మన్ సిహెచ్ నరసింహ గౌడ్ పేరు నిలబెడతానని ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తానని ఇచ్చిన మాట తప్పనని 8వ వార్డు అభివృద్ధి సాధించడమే ముఖ్య లక్ష్యంగా ముందుకు వెళ్తానని ఎనిమిదవ వార్డు అక్కలకు, అమ్మలకు, వృద్ధులకు, పెద్దలకు, యువకులకు మరియు ప్రజలకు పేరుపేరునా విజ్ఞప్తి చేశారు. ఇట్టి సందర్భంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఎలక్షన్స్ వచ్చేముందు బిఆర్ఎస్( టిఆర్ఎస్) పార్టీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు 8వ వార్డు ప్రజలు గుర్తుకొస్తారని, మాయ మాటలు చెప్పి ఒకవైపు బిఆర్ఎస్(టిఆర్ఎస్) పార్టీ అధిష్టానం విలువలు తీసివేసిన ఘనత చింత ప్రభాకర్ దేనని తెలియజేశారు. మళ్లీ నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు దక్కకుండా ఉండేలా దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 8వ వార్డు ప్రజల ఓట్లు గుర్తుకొస్తాయి కానీ అవార్డు ప్రజల సమస్యలు ఏ మాత్రం చింత ప్రభాకర్ కు గుర్తుకు రావని తెలియజేశారు. కావున 8వ వార్డు ప్రజలు పేరుపేరునా ఇలాంటి దురుద్దేశ పూరితమైన బిఆర్ఎస్ (టిఆర్ఎస్ ) పార్టీ కి తగిన గుణపాఠం నేర్పించి సదాశివపేట పట్టణంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని తెలియజేశారు. ఈ యొక్క సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సదాశివపేట ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఎనిమిదవ బ్లాక్ ఇన్చార్జ్ మంజుల ఈశ్వర్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.