మెగా ఫ్యాన్స్‌కు అప్‌డేట్: రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల తేదీ మార్పు.. కొత్త డేట్ ఫిక్స్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ, తాజాగా ఆ తేదీని మారుస్తూ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పవన్ కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న విడుదల కానుండటంతో, బాబాయ్ సినిమాతో పోటీ వద్దు అనుకున్నారో లేక టెక్నికల్ కారణాలో కానీ, చరణ్ సినిమా ఒక నెల వెనక్కి వెళ్ళింది.

ఈ కొత్త విడుదల తేదీని చిత్రబృందం చాలా తెలివిగా ప్లాన్ చేసింది. ఏప్రిల్ 30న విడుదల చేయడం వల్ల మరుసటి రోజు వచ్చే మే డే (మే 1) వీకెండ్ సినిమాకు పెద్ద ప్లస్ కానుంది. సమ్మర్ సెలవుల సీజన్ కావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. “అతడి రాక తేదీ మారుతుంది, కానీ అతడి దృఢ సంకల్పం మారదు” అంటూ మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గ్రామీణ క్రీడల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు వంటి హేమాహేమీలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *