తేది:04-02-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS వర్ధన్నపేట్ నియోజక వర్గం రిపోర్టర్ శ్రీకాంత్ యాదవ్.
వరంగల్:వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా వర్ధన్నపేట మున్సిపాలిటీ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల ను మరియు చెక్ పోస్టులను సందర్శించిన వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ పోలీసులకు పలు సూచనలు అందించారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పోలీస్ బలగాలను పెంచాలని తెలిపారు.అలాగే చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించి అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎస్.ఎస్.టి టీం రిజిస్టర్ ను పరిశీలించి వారికి తగు సూచనలు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నగదు,మద్యం తరలిస్తున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు.ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛయుతంగా వినియోగించుకోవడంలో పోలీసుల పాత్ర కీలకం అని వివరించారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎస్.ఐ సాయిబాబు,ఎస్.ఎస్.టి టీం,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.