సదాశివపేట 8వ వార్డులో బి.ఆర్.ఎస్( టిఆర్ఎస్ ) మాయ మాటలను నమ్మకండి, మోసపోకండి- సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్. చేయి గుర్తుకు ఓటేయండి, కాంగ్రెస్ జెండా ఎగరవేయండి-న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

తేది:04-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.

చేయి గుర్తుకు ఓటేయండి, కాంగ్రెస్ జెండా ఎగరవేయండి-న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత పది సంవత్సరాల బిఆర్ఎస్ (టిఆర్ఎస్ ) పార్టీ 8వ వార్డు ప్రజలకు చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ, 8వ వార్డు అభివృద్ధిని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మీ ముందుకు వస్తున్న 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాజకీయం అంటే వ్యాపారం కాదు, ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం, ప్రజలకు వాళ్ల సమస్యలను పరిష్కరించి, వార్డు అభివృద్ధి చేయడం అని తెలియజేశారు. 8వ వార్డు ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించి ఎనిమిదవ వార్డ్ అభివృద్ధికి కావలసిన పనులను అన్నిటిని చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వార్డు అభివృద్ధి కోసం వెనుకడుగు వేయకుండా ఎల్లప్పుడూ అండగా ఉంటూ ఎనిమిదో వార్డును సుందరవందరంగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు. ఇట్టి తరుణంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ (టిఆర్ఎస్) పార్టీ ప్రజలను నమ్మించి గొంతు కోసిన పార్టీ, ఎంతోమంది విద్యార్థులను రోడ్డుపైకి తీసుకువచ్చిన పార్టీ, 8వ వార్డు అభివృద్ధిని సర్వనాశనం చేసిన పార్టీ బిఆర్ఎస్( టిఆర్ఎస్) పార్టీ అని తెలియజేశారు. అదేవిధంగా ఎనిమిదవ వార్డు ప్రజలు చింత ప్రభాకర్ మోసపూరిత మాటలకు, హరీష్ రావు మోసపూరిత పాటలకు, బిఆర్ఎస్( టిఆర్ఎస్) పార్టీ ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొత్తగొల్ల సోమ శంకర్ ( సోము) మాయమాటలను మోసపూరిత మాటలను నమ్మి మోసపోకండి అని ఎనిమిదో వార్డు ప్రజలకు పేరుపేరునా తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రజాక్, వసీం, శంకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు మంజుల ఈశ్వర్ గౌడ్, అధిక సంఖ్యలో 8వ వార్డు పెద్దమనుషులు మరియు యువకులు, మైనార్టీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *