తేది: 03-02-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS వర్ధన్నపేట ఇంచార్జ్ బొంతల రాకేష్.
వరంగల్ జిల్లా: హనుమకొండలోని జేఎన్ఎస్ క్రీడా ప్రాంగణంలో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ (under 16) ఎంపిక పోటీలో వర్ధన్నపేట మండలం జడ్పీహెచ్ఎస్ ల్యాబర్తి ఉన్నత పాఠశాల విద్యార్థిని మంద నందిని (10th class) పాల్గొని తన క్రీడా ప్రతిభతో నిజామాబాద్ జిల్లా కుమ్మరి పల్లి లో ఈనెల 5 నుండి 8వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొనే ఉమ్మడి వరంగల్ జట్టుకు ఎంపికైందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగం శైలజ, వ్యాయామ ఉపాధ్యాయులు జలగం రఘువీర్ తెలిపారు తన క్రీడా ప్రతిభతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఎం. నందిని ని గ్రామ సర్పంచ్ మన్నూరు శారద సోము, ఉప సర్పంచ్ సంకినేని గంగరాజు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ప్రపోజ్ సునీత మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్ గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు.