సింబల్ అలాట్మెంట్–నామినేషన్ విడ్రాలపై గూగుల్ మీట్- ఎన్నికల ప్రక్రియపై జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ.

తేది:3-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా: ఈరోజు సింబల్ అలాట్మెంట్ (గుర్తు కేటాయింపు) మరియు నామినేషన్ ఉపసంహరణ (విడ్రా) ప్రక్రియలపై అదనపు కలెక్టర్, సంబంధిత ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్లు నిర్వహించిన గూగుల్ మీట్ లో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రతి దశను నిర్ధిష్ట నిబంధనల ప్రకారం, పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. సింబల్ అలాట్మెంట్, నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియల్లో ఎలాంటి గందరగోళం లేకుండా, అభ్యర్థులకు స్పష్టమైన సమాచారం అందించాలని ఆదేశించారు.
అలాగే, ఎన్నికల షెడ్యూల్‌ను కచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల కోడ్ అమలు, ఫిర్యాదుల పరిష్కారం, అభ్యర్థులు మరియు ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో సమన్వయంతో పని చేసి, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గారు అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *