మెట్ పెల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

తేది: 03- 02- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా:మంగళవారం మెట్ పెల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, పరిశుభ్రత పరిస్థితులు, సిబ్బంది హాజరు తదితర అంశాలనుజిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. వార్డులు, ఔషధ నిల్వ గదులను తనిఖీ చేసి రోగులకు అవసరమైన మందులు తగినంతగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా వైద్యులు మరియు సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఈ పరిశీలనలో మెట్ పెల్లి ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా ఆసుపత్రి కో- ఆర్డినేటర్ రామకృష్ణ, ఆసుపత్రి సూపరిండెంట్ సాజిద్ అహ్మద్, ఎమ్మార్వో నీత, వైద్యులు మరియు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *