మువీ పైరసీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ‘ఐబొమ్మ’ (iBomma) వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవి అలియాస్ ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు మూడు రోజులు వాయిదా వేసింది. సైబర్ క్రైమ్ పోలీసుల కౌంటర్ దాఖలు అనంతరం, కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 6 (శుక్రవారం) కి నిర్ణయించింది. ప్రస్తుతం రవి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
నాంపల్లి కోర్టు తిరస్కరణతో హైకోర్టుకు..
గతంలో తనపై నమోదైన నాలుగు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే, పైరసీ తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు ఆయన అభ్యర్థనను కొట్టివేసింది. దీంతో రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, పోలీసులు ఈ కేసులో కీలకమైన కౌంటర్ అఫిడవిట్‌ను సమర్పించారు. పైరసీ సామ్రాజ్యాన్ని నడుపుతూ విదేశీ సర్వర్ల ద్వారా సినిమాలను అక్రమంగా స్ట్రీమింగ్ చేస్తున్నాడని పోలీసులు కోర్టుకు వివరించారు.
పోలీసుల నిఘా.. అరెస్ట్ నేపథ్యం
ఐబొమ్మ రవిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. వెబ్‌సైట్ వేదికగా పోలీసులనే హేళన చేస్తూ సందేశాలు పంపిన రవిని, సైబర్ క్రైమ్ పోలీసులు ఈ-మెయిల్ ఐడిల ఆధారంగా పక్కాగా ట్రాక్ చేశారు. ఆయన హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం అందడంతో వల వేసి అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ నిర్మాతలు ఈ పైరసీ వల్ల భారీ నష్టాలను మూటగట్టుకున్నారని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
విచారణలో సహకరించని నిందితుడు
ప్రస్తుత విచారణలో ఐబొమ్మ రవి పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని సమాచారం. విదేశాల్లో ఉన్న డేటా స్టోరేజ్, ఏజెంట్లు మరియు ఆర్థిక లావాదేవీల గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రవికి బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు వాదిస్తున్నారు. శుక్రవారం జరగబోయే విచారణలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.