తేది:02-01-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా ను చార్మినార్ జోన్లో కలపాలని కోరుతూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అల్లాదుర్గం అసెంబ్లీ సాధన కమిటీ అధ్యక్షులు బ్రహ్మం ఆధ్వర్యంలో, ఎంపీడీవో వేద ప్రకాష్ రెడ్డికి పలు గ్రామాల నాయకులతో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం జిల్లాల పునర్విభజన సందర్భంగా మెదక్ జిల్లాను అన్యాయంగా దూర ప్రాంతంలో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలిపిందని దీనివల్ల ఉద్యోగులకు, నిరుద్యోగులకు, తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సబ్ డివిజన్ కేంద్రమైన అల్లాదుర్గం రాబోయే రోజుల్లో అసెంబ్లీ నియోజకవర్గం అవుతుందని, అందరికీ ఆమోదయోగ్యమైన చార్మినార్ జూన్లో కలిపితే నిరుద్యోగులకు,ఉద్యోగులకు, న్యాయం జరుగుతుందని తెలిపారు. ఉద్యోగ ఉపాధి, బదిలీల విషయంలో రాజన్న సిరిసిల్ల జోన్లో ఉండడంవల్ల సరైన న్యాయం జరగడం లేదని ప్రభుత్వం వెంటనే మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో విలీనం చేయాలని కోరారు. ఎన్నికల హామీలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన ప్రచార సభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని , ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించి మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్, గణపతి ,భూమేష్, సంతోష్, శివకుమార్, పాటు ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.