వర్ధన్నపేట మున్సిపాలిటీ 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు.

తేది:02-02-2026 హన్మకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా: వర్ధన్నపేట మున్సిపాలిటీ 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలకుర్తి సారంగపాణి తరపున, స్థానిక వార్డు సభ్యులతో కలిసి గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజుగ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. వార్డు పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలను గుర్తించి, వాటన్నింటినీ పరిష్కరిస్తానని ఎమ్మెల్యే నాగరాజు భరోసా ఇచ్చారు.వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే రూ.20 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయని తెలిపారు. అలాగే అమృత్ స్కీమ్ కింద రూ.34 కోట్లతో మున్సిపాలిటీ అభివృద్ధి పనులు, 100 పడకల ఆస్పత్రికి రూ.34 కోట్లు, రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఆకేరు వాగు మరమ్మత్తులకు రూ.65 లక్షలు, బంజారా భవన్‌కు రూ.2 కోట్లు, సబ్ జైలుకు 10 ఎకరాల స్థలం, మినీ స్టేడియం, మున్సిఫ్ కోర్టు మంజూరు చేయించడం ద్వారా వర్ధన్నపేటను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు.
ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పూజారి సురేష్ స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఎమ్మెల్యే నాగరాజు గారు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, పర్వతగిరి మాజీ జడ్పీటీసీ బానోతు సింగిలాల్తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *