వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మానిఫెస్టో విడుదల చేసిన డాక్టర్ వన్నాల వెంకటరమణ.

తేది:02-02-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS వర్ధన్నపేట ఇంచార్జ్ బొంతల రాకేష్.

జగిత్యాల జిల్లా: వర్ధన్నపేట మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వన్నాల వెంకటరమణ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు మాజీ శాసనసభ్యులు శ్రీ వన్నాల శ్రీరాములు, శ్రీ రాజేశ్వర రావు, శ్రీ కొండేటి శ్రీధర్ మరియు జిల్లా అధ్యక్షుడు శ్రీ గంటా రవి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వర్దన్నపేట లో అధికారం లోకి రావడం ఖాయం. వర్ధన్నపేట లో కాషాయం జెండాను ఎగరవేస్తాం. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త శక్తివంతంగా మరియు శక్తివంతన లేకుండా పనిచేయాలి, ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా ఒక వీరుడిలా ప్రతి వార్డులో ప్రతి వీదీ లో ప్రతి ఇంటికి గడపగడపకు తిరిగి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఓటర్లకు తెలియజేయాలని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వైఫల్యాలను, మోసలను ప్రజలకు స్పష్టంగా వివరించాలి అని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ బన్న ప్రభాకర్, కన్వినర్, కో కన్వినర్ లు ముత్తిరెడ్డి కేశవరెడ్డి, మళ్ళది తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షులు కొండేటి అనిత సత్యం, వర్దన్నపేట ఎన్నికల ప్రభారీ శ్రీ గుజ్జుల సత్యనారాయణ, ఎన్నికల కన్వినర్ మైస రాము, మున్సిపల్ ఎన్నికల ప్రభారీ జిల్లా కార్యదర్శి శ్రీ రాయపురం కుమారస్వామి, మాజీ వైస్ జడ్పీ చైర్మన్ శ్రీ గజ్జెల శ్రీరాములు, శ్రీ మొoడేటి మహేందర్ రెడ్డి, శ్రీ గడ్డం మహేందర్, శ్రీ పొన్నగోటి వెంకట్రావు, శ్రీ కుచన క్రాంతి కుమార్, వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *