తేది:02-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శ్రీ శేషాద్రిని రెడ్డి ఐపీఎస్, ఎస్పీగా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ చేతుల మీదుగా పిప్పింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శేషాద్రిని రెడ్డి ఐపీఎస్ భుజాలపై స్టార్ చిహ్నాన్ని అలంకరించి అభినందిస్తూ, ఎస్పీగా పదోన్నతి పొందిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ ట్రాఫిక్ డీసీపీగా బదిలీ అయిన సందర్భంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలని సూచించారు.