నూకపెల్లి మోడల్ స్కూల్ కు అదనపు బస్సు సౌకర్యాన్ని కల్పించండి.

తేది:02-02-26 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా : మల్యాల మండలం నుంచి నూకపల్లి మోడల్ స్కూల్ కు వెళ్లే విద్యార్థులకు అదనపు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 200 మందికి పైగా విద్యార్థులు పాఠశాలలో చదువుతుండగా కేవలం ఒకే బస్సు అందుబాటులో ఉంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ చదువుపై దృష్టి సారించలేకపోతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా, సంబంధిత సమస్యపై కలెక్టర్ కార్యాలయంలో నాలుగు సార్లు ఫిర్యాదు చేసిన స్పందన కరువైందని విద్యార్థి తండ్రి పోరండ్ల మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *