TSLAWNEWS కథనానికి స్పందన – జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం డబ్బా గ్రామంలో శిలాఫలకాలపై ఎన్నికల ముసుగుల తొలగింపు.

తేది:02-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో శిలాఫలకాలపై నెలల తరబడి తొలగించకుండా ఉంచిన ఎన్నికల ముసుగులపై TSLAWNEWSలో కథనం వెలువడిన అనంతరం అధికారులు స్పందించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో శిలాఫలకాలపై ఉన్న ముసుగులను తొలగించి శుభ్రం చేశారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకం, ప్రభుత్వ పాఠశాల సమీపంలోని సర్వాయి పాపన్న విగ్రహం వద్ద ఉన్న శిలాఫలకం, మెట్‌పల్లి రోడ్డు దుర్గమ్మ షెడ్ వద్ద ప్రధాన రహదారి పక్కన ఉన్న శిలాఫలకాలతో పాటు వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఉన్న ముసుగు కూడా తొలగించారు.
ముసుగులు తొలగించడంతో శిలాఫలకాలపై అభివృద్ధి పనుల వివరాలు, పేర్లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆలస్యమైనప్పటికీ చర్యలు తీసుకోవడంపై గ్రామస్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *