త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. 2024 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రంలోని రెండో సాంగ్ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 11న సాయంత్రం 4.05 గంటలకు ‘ఓ మై బేబీ’ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.