బహిరన్ దిబ్బ గ్రామంలో మద్యపాన నిషేధం.

తేది:01-02-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.

మెదక్ జిల్లా: అల్లాదుర్గం మండలం పరిధిలో గల బైరన్ దిబ్బ గ్రామంలో సోమవారం సర్పంచ్ పాంపాటి వీరప్ప గ్రామ పెద్దలు ప్రజల ఆధ్వర్యంలో మద్యపానం నిషేధం తీర్మానించారు. గ్రామంలో ఎవరైనా మద్యపానం అమ్మిన వారికి కొన్నవారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామ సర్పంచ్ అందరూ కలిసి తీర్మానం కాపిని అల్లాదుర్గం ఎస్ఐ శంకర్ కు అందజేశారు. ఈ తీర్మానంతో గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంతో గ్రామస్తులు సుఖసంతోషాలతో ఉంటారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *