ఘనంగా రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవం, ఆలయంలో పోటెత్తిన భక్తులు.

తేది:01- 02-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.

మెదక్ జిల్లా: అల్లాదుర్గంలో వెలసిన ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన శ్రీ రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు గ్రామాల భక్తులు ఉదయం నుంచే క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకోగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *