తేది:01-02-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ మండల కేంద్రమైన అల్లాదుర్గం లో బిఆర్ఎస్ శ్రేణులు ఆదివారం ఆందోళన చేపట్టారు. మండలంలోని పలు గ్రామాల నాయకులు,కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి గాంధీ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసనల వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్… అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరచకుండా, బిఆర్ఎస్ అధినేత పై రాజకీయ కక్ష సాధింపు చేయడం సరి కాదని మండిపడ్డారు . ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు . తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన ఉద్యమ నేతను వేధించడం తగదని హెచ్చరించారు. సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, దీనిని ప్రజలు గ్రహిస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, మోహన్ రాథోడ్, నర్సప్ప,శివరాం,బస్వరాజ్,…విట్ఠల్,మాజీ ఎంపిటిసి దశరథ్,మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.