మెదక్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు – జిల్లాలో 30, 30(ఎ) సెక్షన్లు అమలు. ర్యాలీలు,సభలు,రాస్తారోకోలు,సమావేశాలు,ధర్నాలకు అనుమతులు తప్పనిసరి-జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాసరావు ఐపీఎస్.

తేది:1-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా: వ్యాప్తంగా శాంతి భద్రతలను పటిష్టంగా కాపాడే ఉద్దేశంతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పోలీసు యాక్ట్–1861లోని 30, 30(ఎ) సెక్షన్లు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు వెల్లడించారు.
ఈ కాలవ్యవధిలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించడాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రజా శాంతికి భంగం కలిగించే ఎలాంటి కార్యక్రమాలనైనా కట్టడి చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని ఎస్పీ తెలిపారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు జిల్లా ప్రజలు పోలీసు శాఖకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో శాంతి భద్రతలు సుస్థిరంగా ఉండేలా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని, ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *