తేది:1-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: ఈరోజు టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది విధులకు సమయానికి హాజరవుతున్నారా లేదా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్యోగుల హాజరు నమోదు రిజిస్టర్ను ఓపెన్ చేసి క్షుణ్ణంగా పరిశీలించి, రికార్డుల్లో ఉన్న వివరాలు వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ఉన్నాయా అని తనిఖీ చేశారు.
ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, రోగులకు అందుబాటులో ఉన్న సదుపాయాలు, మందుల నిల్వ, పరిశుభ్రత, రోగుల రిజిస్టర్లు తదితర అంశాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరగాలంటే క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి అని పేర్కొంటూ, ప్రతిరోజూ విధులకు హాజరు కచ్చితంగా నమోదు చేయాలని, సేవల్లో పారదర్శకత పాటించాలని జిల్లా కలెక్టర్ గారు సూచించారు.