తేది:01-02 -2026 నల్గొండ జిల్లా TSLAWNEWS నల్గొండ టౌన్ రిపోర్టర్ చిరుమర్తి భరత్ కుమార్.
నల్గొండ జిల్లా: నల్లగొండ పట్టణంలో బ్రహ్మంగారి గుట్ట శ్రీ శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు స్వస్తిశ్రీ చాంద్రమానా శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం మాగా బహుళ ద్వాదశి తేదీ 14-02-26 శనివారం నుండి 16/2/2026 సోమవారం వరకు జరుపుటకు వేదం మూర్తులు సమూహూర్తం నిర్ణయించినారు తేదీ 14-02-2026 ఉదయం 9:30 గంటలకు వేద స్వస్తి, విగ్నేశ్వర పూజ, పుణ్య హవాచనం, కలశ స్థాపన, శంకురారోపణ, అఖండ దీపారాధన, రుద్ర హోమం, తీర్థ ప్రసాద వినియోగం. సాయంత్రం 6 గంటలకు ప్రదోష పూజ, భజన కార్యక్రమం. తేదీ 15-02-2026 ఆదివారం ఉదయం 5 గంటలకు సామూహిక పంచామృత అభిషేకములు, మధ్యాహ్నము 12:27 ని”లకు ఉత్తరాషాఢ నక్షత్ర యుక్త వృషభ లగ్నమునకు. శ్రీ పార్వతీ కాశీ విశ్వనాథ స్వామి కళ్యాణం. తీర్థ ప్రసాదాల వినియోగం సాయంత్రం 6 గంటలకు ప్రదోష పూజ శివరాత్రి జాగరణం.తేదీ16/2/2026 సోమవారం ఉదయం 6 గంటలకు దేవుని సేవా, అగ్ని గుండాలు, ఉదయం 9 గంటలకు నిత్యపూజ, అభిషేకము, బిల్వార్చన, కుంకుమ పూజ, తీర్థ ప్రసాద వితరణ సాయంత్రం 6 గంటలకు ప్రదోష పూజ, భజన కార్యక్రమములు జరుపబడును కావున భక్తులు ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని ఆ పార్వతీ పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ కడపత్ర ఆవిష్కరణ చేశారు శ్రీశ్రీశ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం గుడి అధ్యక్షుడు కొత్తపెళ్లి రాములు, కానుగుల స్వామి, బొలుగురు యాదగిరి, పరమాత్మ, తడకమళ్ళ సురేష్, దేవేందర్, రాము, సతీష్, శ్రవణ్, నటరాజ్, తదితరులు పాల్గొనారు.