వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్ : దేశ వ్యాప్తంగా కరోనా విజృంబిస్తున్న వేల , ఆంధ్ర సీఎం జగన్ అన్నిటిని సామరస్య పూర్వకంగా సమన్వయ పరుస్తూ పాలన కొనసాగిస్తున్నారు .  పొదుపు సంఘాల మహిళలకు బడ్జెట్ లో  ఇచ్చిన మాట నెరవేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక పక్క కరోనా వైరస్‌తో రాష్ట్ర ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. మరో పక్క కేంద్రం నుంచి వచ్చే నిధులూ తగ్గిపోయాయి. ఇంకో పక్క పేదలను ఆదుకోవడానికి ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీతో పాటు పేద కుటుంబాలకు 1000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పొదుపు సంఘాల అక్క చెల్లమ్మలకు ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. 
►ఇందులో భాగంగా శుక్రవారం వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పొదుపు సంఘాల అక్క చెల్లమ్మల ఖాతాలకు సున్నా వడ్డీ డబ్బులను జమ చేసే బటన్‌ను నొక్కుతారు. 
►ఈ బటన్‌ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఒకే విడతన డబ్బులు జమ అవుతాయని సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు.
►90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అవుతుంది. కాగా, ఇప్పటికే మీ రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదేనని పొదుపు సంఘాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *