తేది:01-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో శ్రీ సాయి సర్వీస్ సెంటర్ కార్ వర్క్ షాప్ వద్ద తేది:31-01-2026 రోజున మిత్రబృందం ఆధ్వర్యంలో కోవూరి నాగరాజు గౌడ్ ( సురేష్ గౌడ్) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క జన్మదిన వేడుకల్లో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో ఒక యువ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవలందిస్తూ, ప్రజల పనులు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ముందుకు నడుస్తూ కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల అండదండలతోని గెలిపించుకునే విధంగా ముందుకు సాగుతున్న కోవూరి నాగరాజ్ గౌడ్( సురేష్ గౌడ్ ) కు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా మిత్ర బృందం జన్మదిన వేడుకలు సందర్భంగా మొబైల్ ఫోనును గిఫ్ట్ గా అందజేశారు, కోవూరి నాగరాజ్ గౌడ్ లాంటి కాంగ్రెస్ నాయకులు అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడం ఎంతో ఆనందదాయకమని తెలియజేశారు. ఇట్టి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కోవూరి నాగరాజ్ గౌడ్ ( సురేష్ గౌడ్) ఆనందంతో ప్రజలకు సేవ చేయడంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎప్పుడు ప్రజల్లో ఒకనిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజల అండదండలతో ముందుకు నడుస్తానని పేరుపేరునా మిత్ర బృందానికి ప్రజలకు మరియు జన్మదిన వేడుకలు జరిపిన వారందరికీ పేరుపేరునా తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో బుదేరా ఆంజనేయులు గౌడ్, కోవూరి వెంకటేశం( చిన్న) గౌడ్, సారా సాయి గౌడ్, అనిల్ కుమార్ మరియు మిత్ర బృందం పాల్గొన్నారు.