77 వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నా కానీ ప్రజలకు రాజ్యాంగంపై కనీస అవగాహన కల్పించకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యం తగదు-రాజ్యాంగ పరిరక్షణ వేదిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

తేది:31-01-2026 నిర్మల్ జిల్లా TSLAWNEWS నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీనివాస్ నూనెల.

నిర్మల్ జిల్లా: ఈరోజు నిర్మల్ నియోజకవర్గం సారంగాపూర్ మండల తహసిల్దార్ సంధ్యారాణి మేడం గారితో రాజ్యాంగ పరిరక్షణ వేదిక నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ఆవిష్కరింపజేసిన రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ నూనెల ఆచార్య.శ్రీనివాస్ ఆచార్య మాట్లాడుతూ నూతన సంవత్సర క్యాలెండర్ లో రాజ్యాంగ పీఠిక తో తీసుకురావడం విశేషమని. మరియు ప్రభుత్వాలు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను అమలుపరచాలని. రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయాలని. విద్య వైద్యం ఉచితంగా ప్రభుత్వాలే జాతీయం చేయాలని సంపూర్ణ అక్షరాస్య దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని సమ సమాజ నిర్మాణానికి ప్రభుత్వాలు పునాదివేసి రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయాలని. రాజ్యాంగ పీఠికను స్కూళ్లలో మరియు కళాశాలలో మరియు రోజు ప్రార్ధన చేసే విధంగా సమయాన్ని కేటాయించి అమలుపరచాలని మరియు ప్రభుత్వ కార్యాలయంలో రాజ్యాంగ పీఠికను పెట్టాలని. ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. రాజ్యాంగం వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్లు యోహన్, ఖాదర్, మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, గంగాధర్ లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *