తేది:30-01-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా: యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని వట్టిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల లక్ష్మి శేషారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన అల్లాదుర్గం లో సీఎం కప్పు వాలీబాల్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి అద్భుతమైన ప్రతిభను చూపి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి ముందుగా క్రీడాకారులకు అభినందనలు తెలిపి టాస్ వేసి తొలి మ్యచిని ప్రారంభించారు. వాలీబాల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా శేషారెడ్డి యువతను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతొ పాటు శారీరకధృఢత్వ ని క్రమశిక్షణనీ పెంచుతాయని పేర్కొన్నారు గెలుపు ఓటముల కంటే క్రీడ స్ఫూర్తితో ఆడటం ముఖ్యమని యువతకు సూచించారు.ఈ కార్యక్రమంలో తాసిల్దారు మల్లయ్య, ఎంపీడీవో వేద ప్రకాశ్ రెడ్డి, ఎంఈఓ లక్ష్మణ్, స్కూల్ హెడ్ మాస్టర్ పిచ్చయ్య , ఉపాధ్యాయులు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నరసింహారెడ్డి, బాలకిషన్, ఉప సర్పంచ్ పాండు,సోషల్ మీడియా కోఆర్డినేటర్ జైపాల్, శ్రీకాంత్,క్రీడాకారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.