తేది:30-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 1వ వార్డు నుంచి మస్కురి అండాలు వెంకటి (వెంకన్న) నామినేషన్‌ను విజయవంతంగా దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక నుంచి తమ పూర్తి దృష్టి 1st వార్డ్ ఔరంగాబాద్ సమగ్ర అభివృద్ధిపైనే ఉంటుందని స్పష్టం చేశారు.
వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మంచి సీసీ రోడ్లు,తాగునీటి సరఫరా, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ, సీసీ కెమెరాలతో భద్రత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా అధికారులతో సమన్వయం చేస్తూ నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. ప్రజల సమస్యలపై పోరాటమే తమ రాజకీయ జీవనమని, కౌన్సిలర్ పదవి కంటే ప్రజల సేవే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.
“అభివృద్ధే మా లక్ష్యం ప్రజలే మా బలం” అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని, ఔరంగాబాద్‌కు మెరుగైన భవిష్యత్తు అందించాలంటే ప్రజల ఆశీర్వాదం అవసరమని వెంకన్న కోరారు.
ఈ ఎన్నికల్లో 1వ వార్డు నుంచి మస్కురి అండాలు వెంకటి (వెంకన్న)కు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు.