
తేది:30-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: నిజాంపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో 10వ తరగతి ప్రత్యేక తరగతులను కలెక్టర్ పరిశీలించారు.
వార్షిక పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచే లక్ష్యంతో, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, వారికి అదనపు తరగతులు నిర్వహించలని తెలిపారు.
ప్రత్యేక తరగతుల నిర్వహణ వల్ల నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు.
అనంతరం కలెక్టర్ ఉపాధ్యాయుల బోధన శైలిని పరిశీలిస్తూ విద్యార్థుల సామర్ధ్యాలను పరీక్షించారు.
గణితం, సైన్స్, ఇంగ్లీష్ వంటి ముఖ్యమైన సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పెట్టాలని ఆదేశించడం జరిగిందని అన్నారు.ప్రతి విద్యార్థి మంచి మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు , విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.