తేది:30-01-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: మల్యాల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బొట్ల జయ ప్రసాద్ ఆధ్వర్యంలోని పాలకవర్గం శుక్రవారం కలెక్టర్ సత్యప్రసాద్ ను కలిసి గ్రామంలోని పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గ్రామంలో ప్రధాన సమస్య అయిన కోతులు, కుక్కల బెడద అధికమైనందున ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్కు విన్నవించారు. కాగా, స్పందించిన కలెక్టర్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు.