జగిత్యాల జిల్లా నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల జనరల్ అబ్సర్వర్ సుదామా రావు ఐఏఎస్.

తేది:30-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు నియమితులైన ఎన్నికల జనరల్ అబ్సర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు శుక్రవారం ధర్మపురి మరియు జగిత్యాల మున్సిపాలిటీలలో జరుగుతున్న నామినేషన్ ల సరళిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్నికల జనరల్ అబ్సర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు మాట్లాడుతూ:
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు అందరు ఎన్నికల నియమావళి మేరకు తమ విధులు నిర్వర్తించాలని
అలాగే నామినేషన్ కేంద్రాల వద్ద అన్ని పత్రాలు నింపడం, సరైనా ధ్రువీకరణ పత్రాలు వంటివి రిటర్నింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలంచాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు.
నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను ఉపయోగించుకునేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు.
పోటీ చేసే అభ్యర్థులు నిర్దేశించిన వ్యయ పరిమితి మేరకు ఖర్చులు చేయాలని అందుకు ప్రత్యేక బ్యాంక్ ఖాతా తీసుకోవాలని తెలిపారు. ఫ్లయింగ్ స్కాడ్,
ఎఫ్ ఎస్ టి,ఎస్ ఎస్ టి టీములు తమ విధులు జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల్లో నియమితులైన సిబ్బంది ఎన్నికల నియమావళి ప్రకారం తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో ఎన్నికల విధులు జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో ఆర్డిఓ స్పెషల్ ఆఫీసర్, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు, తహసీల్దార్ లు, సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *