రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ఫౌజీ విడుదల తేదీ..ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాతో.. క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి తొలిసారి ప్రభాస్‌తో కలిసి పనిచేస్తున్నారు. సీతారామం తర్వాత ఈ దర్శకుడు తీస్తున్న..సినిమా కావడం కూడా విశేషం. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇప్పటికే విడుదలైన ప్రీ-లుక్.. టైటిల్ పోస్టర్లు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యాయి. ప్రభాస్‌ను ఇందులో చాలా పవర్‌ఫుల్‌గా చూపిస్తున్నారని అభిమానులు చెబుతున్నారు. పోస్టర్లలో కనిపించిన ప్రభాస్ లుక్ చాలా రా అండ్ ఇంటెన్స్‌గా ఉండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
సినిమా షూటింగ్..పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒకేసారి జరుగుతున్నాయి. నిర్ణీత సమయానికి సినిమా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభాస్ భారీగా డేట్స్ కేటాయించినట్లు సమాచారం. ఇండస్ట్రీ నుంచి వస్తున్న వార్తల ప్రకారం..నిర్మాతలు ఈ సినిమాను దసరా పండుగకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దసరా అనేది సంక్రాంతి తర్వాత పెద్ద స్టార్ల సినిమాలకు అత్యంత ముఖ్యమైన సీజన్‌గా భావిస్తారు. ఎక్కువ..సెలవులు ఉండటంతో కలెక్షన్లకు మంచి అవకాశం ఉంటుంది.
హను రాఘవపూడి.. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారని టాక్. అర్జునుడి లక్ష్యబద్ధత, కర్ణుడి ధైర్యం, ఏకలవ్యుడి.. అంకితభావం కలిసిన పాత్రగా ప్రభాస్ కనిపించబోతున్నాడట. అందుకే ఈ పాత్రకు భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని సమాచారం.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. హీరోయిన్‌గా ఇమాన్‌వి నటిస్తున్నారు. మ్యూజిక్, టెక్నికల్ విలువలు కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతాయని అంటున్నారు.
ఇక ప్రభాస్ విషయానికి వస్తే, ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘ది రాజా సాబ్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినప్పటికీ ప్రభాస్ వెనక్కి తగ్గకుండా మరోసారి పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ దసరాకు ఫౌజీతో రాబోతున్నారు. సంక్రాంతి విజేత కాలేకపోయిన ప్రభాస్… దసరా విజేత అవుతాడా? అన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తికర చర్చగా మారింది.
దీంతో ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా దసరాకు థియేటర్లలో విడుదలై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.