మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. బారామతిలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తుల మంటలు చెలరేగడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
మహారాష్ట్రలో ఘోర విమానం ప్రమాదం
మహారాష్ట్రలో ఘోర విమానం ప్రమాదం జరిగింది. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. విమానం కూలిన వెంటనే విమానం భారీ ఎత్తున ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో అక్కడే ఉన్న స్థానికులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారం కోసం విమానంలో వెళ్తున్న డిప్యూటీ సీఎం, బారామతిలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో కుప్పకూలింది.
ఘటన సమయంలో విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తోపాటు మరో ఐదుగురు ఉన్నారు. బుధవారం ఉదయం 8.45 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. విమాన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్టు డీజీసీఏ వెల్లడించింది. బారామతి ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నించే క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా పలువురు మృతి
జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఒక్కరోజు ఆయన నాలుగు భారీ బహిరంగ సభలకు హాజరుకావాల్సివుంది. సంఘటనా స్థలం నుండి మంటలు, పొగలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. ఘటన ప్రాంతంలో ధ్వంసమైన విమానం అవశేషాలు కనిపించాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నారు. వెంటనే అక్కడికి అంబులెన్సులు వచ్చాయి.
మంగళవారం ముంబైలో జరిగిన కేబినెట్ సమావేశానికి అజిత్ హాజరయ్యారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతికి బయలుదేరారు. విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్. ఆయనతోపాటు వ్యక్తిగత, భద్రతా సిబ్బంది అందులో ఉన్నారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్టు డీజీసీఏ వెల్లడించింది.
అజిత్ పవార్ వయస్సు 66 ఏళ్లు. ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయ నేతల్లో ఆయన కూడా ఒకరు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్. ఎన్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, మహారాష్ట్రకు గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మారుతున్న రాజకీయాల నేపథ్యంలో బాబాయ్ శరద్ పవార్‌తో తెగదెంపులు చేసుకుని ఎన్సీపీ నుంచి బయటకు వచ్చి వేరు కుంపటి పెట్టుకున్నారు.
మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పని చేస్తున్నారు. దాంతోపాటు ఆర్థిక, ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ అభివృద్ధి వంటి శాఖలను ఆయన నిర్వహిస్తున్నారు. మరోవైపు ఘటన గురించి తెలియగానే అజిత్‌పవార్ భార్య సునేత్ర, సోదరి సుప్రియా సూలే హుటాహటిన బారామతికి బయలుదేరారు. అజిత్ పవార్ హఠాన్మరణంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.