తేది: 28-01-26 జగిత్యాల జిల్లా TSLAWNEWS
మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: మల్యాల బీసీ కాలనీలోని ప్రజలకు రేషన్ సరుకులు తీసుకోవడానికి ఇబ్బంది తలెత్తుతున్నందున 3 రోజులపాటు కాలనీలోనే సరుకులను పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని MRO వసంతకు వార్డు సభ్యురాలు గాండ్ల జ్యోతివేణు బుధవారం వినతిపత్రం సమర్పించారు. కాగా, 400 పైగా రేషన్ కార్డులున్న కాలనీలో దుకాణం అందుబాటులో లేకపోవడంతో సుమారు కిలోమీటర్ పైగా నడుచుకుంటూ సరుకులు తీసుకోవడానికి వృద్ధులు, మహిళలు ఇబ్బంది పడుతున్నట్లు వినతిలో పేర్కొన్నారు. వినతి సమర్పించిన వారిలో సతీష్, శంషుద్దీన్ ఉన్నారు.