క్రీడా స్ఫూర్తిని కలిగి ఉన్నతంగా ఎదగాలి – ఎఎస్పీ శేషాద్రిని రెడ్డి.

తేది:28- 01- 2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రాయికల్ మండలం రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.

జగిత్యాల జిల్లా: బాలికలు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండి చదువులో రాణించి ఉన్నతంగా ఎదగాలని జగిత్యాల ఎఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు లోని పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని బుధవారం ఆమె సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బాలికలతో ఆమె మాట్లాడుతూ శ్రద్ధ, పట్టుదల, ఏకాగ్రత తో చదివితే మంచి ఉత్తీర్ణత సాధించి ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చని అన్నారు.చెడు వ్యసనాలకు, దూరంగా ఉండాలని. అత్యవసర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న సి.యం.కప్ క్రీడా పోటీల గూర్చి తెలుసుకున్నారు రాయికల్ యస్ ఐ సుధీప్ రావు ఉపాధ్యాయులు చెరుకు మహేశ్వర శర్మ, పుర్రె రమేష్,పి.గంగాధర్, వ్యాయామ ఉపాధ్యాయులు రవీష్ రెడ్డి భీమేష్,జగన్, ,నితీన్ విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *