తేది:28-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ .
మెదక్ జిల్లా: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు – 2026లో భాగంగా నో డ్యూ సర్టిఫికెట్లు పొందడం, నామినేషన్లు దాఖలు చేయడం కోసం ఈరోజు మెదక్ మున్సిపల్ కార్యాలయంలో భారీ రద్దీ నెలకొంది.అతి తక్కువ సమయం ఉండడంతో ఉదయం నుంచే అభ్యర్థులు, నాయకులతో మున్సిపల్ కార్యాలయ పరిసరాలు హడవిడిగా మారాయి. భారీగా అభ్యర్ధులు తరలిరావడంతో కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి నామినేషన్ ప్రక్రియను క్రమబద్ధంగా నిర్వహించారు. నామినేషన్ దాఖలాలతో మెదక్ పట్టణంలో ఎన్నికల ఉత్కంఠ మొదలయ్యింది.