తేది:28-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా: మెదక్ లోని 28వ వార్డులో గతపాలకులు హామీలు ఇచ్చి వార్డు అభివృద్ధి చేయలేదు అని మాటకు కట్టుబడి వుంటా హామీలు నరవేరుస్తాని 28 వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి బండ పూజనరేష్ అన్నారు. బుధవారం రోజున మెదక్ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ ధఖాలు చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వార్డు అభివృద్ధి నా లక్ష్యం అని వార్డులొ అన్ని సౌకర్యాలు కల్పిస్తానని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, వారి సమస్యనే నా సమస్యగా భావించి వార్డులో జరిగేటటువంటి ప్రతి ఒక్క సమస్యపై దృష్టి సారించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. గత పాలకులు స్వార్థ రాజకీయలు చేశారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో పోటీ ఎక్కువగా వున్నా నాపై మా వార్డులొ పెద్ద మనుషులు యువత మహిళలు నాపై అభిమానం చూపిస్తున్నారని, వారి నమ్మకం నిలబెట్టుతమని హామీ ఇచ్చారు, ముఖ్యంగా నాకు వెన్నంటి ఉండి ప్రోత్సహం ఇచ్చి న రాబిన్ దివాకర్, అరుణ్, రషీద్ ఖాన్,28వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.