తేది:28-01-2026 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా: తెలంగాణ మెడికల్ & సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (TMSRU) వరంగల్ శాఖ సర్వసభ్య సమావేశం నయీం నగర్‌లోని సంఘ భవనంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి గుండా శ్రీనివాస్ గారు హాజరై, సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఔషధాలపై GSTను సున్నా శాతానికి తగ్గించాలనే యూనియన్ పోరాట ఫలితంగా అవసరమైన కొన్ని మందులపై GST 5%కి తగ్గినదాన్ని గొప్ప విజయంగా పేర్కొన్నారు. అయినప్పటికీ ఔషధాలు, వైద్య పరికరాలపై పన్నులు పూర్తిగా తొలగించే వరకు పోరాటం కొనసాగాలని పిలుపునిచ్చారు. నకిలీ, నాసిరకం మందులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆన్‌లైన్ మందుల అమ్మకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యం ప్రతి పౌరుని మౌలిక హక్కు కావున బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి 5% నిధులు కేటాయించాలని కోరారు.
నాలుగు కార్మిక కోడ్లు, ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ ద్వారా కార్మికుల హక్కులు దెబ్బతింటున్నాయని, Sales Promotion Employees Act–1976ను రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ డిమాండ్ల సాధనకై ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో మెడికల్ & సేల్స్ రిప్రజెంటేటివ్స్ పాల్గొంటారని తెలిపారు.
ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షులు: వినయ్ కుమార్
కార్యదర్శి: వి. సుధీర్ కుమార్
కోశాధికారి: బాస్కర్
ఉపాధ్యక్షులు: వెంకటేష్, బాస్కర్
సహాయ కార్యదర్శులు: రాజ్ కుమార్, మహేష్
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీ. శ్రీనివాస్, సతీష్, నరేష్‌తో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.