తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ ప్రారంభమైంది. కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లోని బాత్‌రూంలో జారీ కిందపడటం వల్ల.. కాలికి గాయం కావడంతో హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీని వైద్యులు ప్రారంభించారు. శస్త్ర చికిత్సకు దాదాపు 2 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది.